కొండపి: సింగరాయకొండలో నూతనంగా నిర్మించిన సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కె.మణ్మధ రావు
సింగరాయకొండలో నూతనంగా నిర్మించిన సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ కె. మణ్మధ రావు కోర్టు భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను ప్రజలకు అత్యంత చేరువగా చేర్చే ప్రక్రియలో భాగంగా సింగరాయకొండలో కోర్టును ఏర్పాటు చేశామని తెలిపారు. కొండేపి నియోజకవర్గ ప్రజలు న్యాయ సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అన్సారియా మరియు ఎస్పీ దామోదర్, జిల్లా జడ్జి భారతి తదితరులు పాల్గొన్నారు.