రామన్నపేట: మూసీ నదిలో కొట్టుకుపోయిన లక్ష్మాపురం గ్రామానికి చెందిన యువకుడిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన మత్స్యగిరి అనే యువకుడు మూసీ నదిలో కొట్టుకుపోగా రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శనివారం ఉదయం యువకుడిని సురక్షితంగా కాపాడారు. కాగా యువకుడు 14 గంటలుగా మూసీ నదిలో చెట్టును పట్టుకొని ఉన్నాడు. యువకుడిని సురక్షితంగా కాపాడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బందిని పోలీసులను పలు గ్రామాల ప్రజలు అభినందించారు.