గుంతకల్లు: గుత్తిలో అకాల వర్షం, ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షం
గుత్తిలో మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులు తోడయ్యాయి. అకాల వర్షం కురిసింది. అయితే ఇన్నాళ్లు ఎండ వేడిమి తో ఇబ్బందులు పడ్డ జనాలకు వర్షం కారణంగా కాస్త ఉపశమనం లభించింది. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు రావడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు.