రాప్తాడు: ఆకుతోటపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ కార్యకర్తలను సన్మానం చేసిన టిడిపి నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఆకుతోటి పల్లి గ్రామంలో ఆదివారం 1110 నిమిషాల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాగే మురళీమోహన్ బాబు శేఖర్ అనిల్ చౌదరి తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు ఆకుతోటి పల్లి గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించి సీనియర్ టిడిపి నేతలను సన్మానం చేయడం జరిగిందని పార్టీ కోసం పనిచేసేవారిని ఎప్పుడు పార్టీ గుర్తుంచుకుంటుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఆకుతోటపల్లి టిడిపి నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.