సంతనూతలపాడు: పాడి పశువుల్లో ఆధునిక యాజమాన్య పద్ధతులపై పాడి రైతులకు శిక్షణ ఇచ్చిన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు
సంతనూతలపాడు రైతు సేవా కేంద్రంలో గురువారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువుల్లో ఆధునిక యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పాడిపశువుల ఆదాయాన్ని పెంపొందించేందుకు శాస్త్రీయ పద్ధతులపై పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. పశువుల పోషణ, పాలు తీసే యంత్రాల వినియోగం, పాడి పరిశ్రమ వ్యాపార నైపుణ్యాలపై పాడి రైతులకు జిల్లా పశు వైద్యాధికారి వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు.