కర్నూలు: కర్నూలులో రోడ్డు ప్రమాదం: వాహనాలు ఢీకొనడంతో ఒకరికి గాయాలు
కర్నూలు-నంద్యాల జాతీయ రహదారిపై సఫా కళాశాల వద్ద జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గాయపడ్డారు. బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రాణాపాయం లేదని, తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు.