రఘునాథపల్లె: జనగామ జిల్లాలో నిండిన చెరువులు: అలుగు పారుతున్న ఖిలాషాపురం, మేకలగట్టు చెరువులు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ వర్షాలకు చెరువులు నిండాయి. ఖిలాషాపురం, మేకలగట్టు గ్రామాల్లో చెరువులు అలుగు పారుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.