ఒంగోలు అర్బన్: ప్రైవేట్ హాస్పిటల్స్ కు దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ రూపుదిద్దుకుంటున్నాయి: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రైవేట్ హాస్పిటల్స్ దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రూపుదిద్దుకుంటున్నాయని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. శనివారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో క్రిటికల్ కేర్ యూనిట్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రారంభించారు. ఆసుపత్రిలో సదుపాయాలు కార్పొరేట్ హాస్పిటలకు దీటుగా ఉన్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి పాల్గొన్నారు.