కూసుమంచి: ఆర్టీసీ బస్సులో మద్యం సేవించిన యువకుడు: పోలీసుల అదుపులో గోపి
ఖమ్మం నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మద్యం సేవించి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన జగ్గయ్యపేటకు చెందిన గోపి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కండక్టర్ హెచ్చరించినా వినకపోవడంతో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. నిందితుడిని నేలకొండపల్లి స్టేషన్కు తరలించారు.