తాడిపత్రి: తాడిపత్రిలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు, హనుమాన్ కాలనీ తదితర ప్రాంతాల్లో బుధవారం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా తమ ఇళ్లకు రావడం పెన్షన్ లబ్ధిదారులు సంతోషపడ్డారు. సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.