జడ్చర్ల: NH 44 పై భారీ ట్రాఫిక్ జామ్: జడ్చర్ల టోల్ గేట్ వద్ద నిలిచిన వాహనాలు
దసరా పండుగ సెలవుల కారణంగా హైదరాబాద్ నుండి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నేషనల్ హైవే 44 రద్దీగా మారింది. జడ్చర్ల ఎక్స్ప్రెస్ టోల్గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.