యర్రగొండపాలెం: ఎన్టీఆర్ పింఛన్ అందజేసిన వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం అమ్మవారి శాల బజారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు పాల్గొని ఇంటింటికి తిరిగి పింఛన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛను ప్రతి నెల ఒకటో తేదీన ఇచ్చిన ఘనత సీఎంకు చెందుతుందన్నారు