కొండపి: గురుకుల పాఠశాలలకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన మంత్రి స్వామి
గురుకుల పాఠశాలలో ఐదో తరగతి మరియు ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి శుక్రవారం అమరావతి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలను సీఎం చంద్రబాబు మరియు ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.