కొండపి: పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామంలో పర్యటించిన ఎంపీడీవో సుజాత
పొన్నలూరు మండలం వెంకుపాలెం గ్రామంలో సోమవారం ఎంపీడీవో సుజాత పర్యటించారు. ముందుగా గ్రామ శివారులో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలను పరిశీలించారు. అలాగే పెండింగ్లో ఉన్న పంచాయతీ కార్యాలయాన్ని, గ్రామంలోని సైడ్ కాలువలు లేకపోవడం వంటి అంశాలను గ్రామస్థులు ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీడీవో తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.