కనిగిరి: టిడిపి ఆవిర్భావంతోటే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభించిందని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరి లోని టిడిపి కార్యాలయంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టిడిపిని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.