మహబూబ్ నగర్ అర్బన్: గో సంరక్షణకు విరివిగా నిధులు కేటాయించాలి:విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ బాలస్వామి
గో సంరక్షణకు పరిరక్షించేందుకు ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించాలని గురువారం మహబూబ్ నగర్ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. గోసంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో ఉన్న దేవులపార్ గోవిజ్ఞాన కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వ అధికారులు సందర్శించాలని అన్నారు. అక్కడి మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలుకు తీసుకురావాలన్నారు