మహబూబ్ నగర్ అర్బన్: ఉపాధ్యాయ వృత్తి దేశ నిర్మాణానికి తోడ్పడుతుంది : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ఉపాధ్యాయ వృత్తి దేశ నిర్మాణానికి తోడ్పడుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఏనుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ ఉపాద్యాయురాలు శ్రీమతి ఎ. అజిత గారి పదవీ విరమణ మహోత్సవం మహబూబ్ నగర్ పట్టణం లోని జేజేఆర్ ఫంక్షన్ హాలు లో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై శ్రీమతి అజిత గారికి పదవీవిరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 37 సంవత్సరాలపాటు అజిత గారు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి, ఆ వృత్తికే వన్నె తెచ్చారని ఆయన అన్నారు.