మహబూబ్ నగర్ అర్బన్: రైతుల చేతులకు సంకెళ్లు వేసి దొంగలు భయపెట్టిస్తున్న ప్రభుత్వం: మాజీ మంత్రి
ప్రభుత్వం రైతుల చేతులకు సంకెళ్లు వేసి దొంగలు, బందిపోట్ల మాదిరిగా భయపెట్టిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ధన్వాడలో ఇథనాల్ కంపెనీని వ్యతిరేకించి జైలు కెళ్ళిన రైతులు బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. వారిని మాజీ మంత్రి వారిని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అణిచివేతలను ఎదిరించే స్వభావం తెలంగాణ ప్రజలలో ఉందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు