మహబూబ్ నగర్ అర్బన్: సంక్షేమ వసతి గృహాలు పరిశుభ్రంగా ఉండాలి'జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలు పరిశుభ్రంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో వసతి గృహాలు, గురుకుల పాఠశాలల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఎంత మందికి అందించారని ప్రశ్నించారు. విద్యార్థుల హెల్త్ చెకప్కి సంబంధించిన వివరాలు ప్రిన్సిపల్స్ వద్ద ఉండాలన్నారు.