రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: అర్నబ్ తుఫాను అలర్ట్ - కంట్రోల్ రూమ్ నెంబర్ 9494060060
అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల సహాయం కోసం 9494060060 నెంబర్‌తో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.