గుమ్మడిదల: గుమ్మడిదల వీరభద్ర కాలనీలో 73 మంది మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు
గుమ్మడిదల మున్సిపాలిటీ వీరభద్ర కాలనీలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష శిబిరం జరిగింది. చైర్మన్ చిన్న పాపని కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 73 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల్లో నివేదికలు అందజేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.