కనిగిరి: అమరావతిలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అమరావతిలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గం లోని పలు పెండింగ్ సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లి వాటిని పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో నిర్మిస్తామని చెప్పిన ట్రిపుల్ ఐటి కళాశాల నిర్మాణానికి నిధులు కేటాయించి, కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే మంత్రి లోకేష్ ను కోరారు. మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించి కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.