శ్రీశైలం: వెలుగోడు రిజర్వాయర్ నుండి తెలుగు గంగ ప్రధాన కాలువకు త్రాగునీరు కోసం నీరు విడుదల
వెలుగోడు రిజర్వాయర్ నుండి తెలుగు గంగ ప్రధాన కాలువకు త్రాగునీరు విడుదల చేశారు. కాలువల వెంట ఉన్న అన్ని తూములను మూసివేసి క్రింది ప్రాంతానికి తెలుగు గంగా ద్వారా నీరు తరలి వెళ్లే వరకు అన్ని తూములను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలుగు గంగ ప్రధాన కాలువకు చెందిన సంబంధిత లస్కర్లను అప్రమత్తం చేస్తూ వీరిపై పై స్థాయి అధికారులు పర్యవేక్షిస్తూ నీటిని క్రిందికి పోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. తెలుగు గంగ నీరు చివరి ప్రాంతానికి చేరిన అనంతరం తూముల ద్వారా చెరువులకు త్రాగు నీటిని నింపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.