శ్రీశైలం: మహానంది మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా నిబంధనలకు విరుద్ధంగా తెలుగంగ కట్టపై బారి టిప్పర్ల రాకపోకలు
మహానంది మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవే పనుల పేరుతో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెలుగుగంగ కట్టపై భారీ టిప్పర్ల రాకపోకలు సాగుతుండటంతో తెలుగుగంగ కాల్వ కరకట్ట ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ వాహనాల రాకపోకలతో కరకట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో కాల్వకు, పరిసర ప్రాంతాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.