మండపేట: మండపేట మండలం ఇప్పనపాడులో పరుపులు లోడు వ్యాన్ దగ్దం..రూ.20 లక్షలు ఆస్తీ నష్టం..
మండపేట మండలం ఇప్పనపాడులో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి వ్యాన్ దగ్నమై భారీఆస్తి నష్టం జరిగింది. ద్వారపూడి నుండి ఇప్పనపాడు ఏరోప్లేక్స్ పరుపుల గోడౌన్ లోకి రీబాండెడ్ పరుపుల మెటీరియల్ను తీసుకుని వెళుతుండగా కరెంటు వైర్లు తగలడంతో మంటలు వేగంగా చేలరేగడంతో రోడ్డుపైనే వ్యాన్ నిలిపేసారని తెలిపారు.సుమారు 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసారు.సంఘటన స్థలానికి మండపేట, అనపర్తి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు.