గుడివాడ: డిసెంబర్ లోపే గుడివాడ మున్సిపల్ ఎన్నికలు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
డిసెంబర్ లోపు గుడివాడ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. ఎన్నికలను అడ్డుకోవాలని వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదని, తాము ఎన్నికలకు పూర్తి సిద్ధంగా ఉన్నామని ఆయన ఆదివారం తెలిపారు.