గుడివాడలోని నాగవరపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి కుశ్వంత్ మంగళవారం (21) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఘటనకు కారణమని తెలుస్తోంది. మోటూరు - గుడివాడ మధ్య రైల్వే పట్టాలపై పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. బుధవారం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.