కాకినాడ రూరల్: పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని గొర్రెపూడి హై స్కూల్ విద్యార్థులు అవగాహన కల్పించారు క్రాఫ్ట్ టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం జిగురు మట్టితో గణపతి విగ్రహాలు తయారుచేసి ఉపాధ్యాయులకు అందజేశారు హెడ్మాస్టర్ ఉమామహేశ్వరి వారిని అభినందించారు వారిలో దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసి ఉపాధ్యాయులను ప్రశంసించారు.