శ్రీశైలం: శ్రీశైలంలో బొలెరో వాహనం బీభత్సం డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
[శ్రీశైలంలో బొలెరో ట్రక్ వాహనం బీభత్సం సృష్టించింది కర్నూలు నుండి శ్రీశైలానికి కూరగాయల లోడుతో వస్తున్న బొలెరో ట్రక్ వాహనం టోల్గేట్ సమీపంలో అదుపు తప్పి వాహనం కట్టలు తెగి పక్కనే ఉన్న శివలింగం పార్కులోకి బొలెరో ట్రక్ దూసుకెళ్లింది అయితే డ్రైవర్ అప్రమత్తతతో చాకచక్యంగా పక్కనే ఉన్న డివైడర్స్ ని పార్కు గోడను డీ కొట్టి బొలెరో ఆపడంతో పెను ప్రమాదం తప్పింది ప్రమాద సమయంలో మనుషులకు వాహనాలకు ఎవరికి ఏమి కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు కూరగాయలను శ్రీశైలంలో దుకాణాలకు వేసేందుకు కర్నూలు నుండి శ్రీశైలం వస్తుండగా టోల్ గేట్ దగ్గర ఢీకొట్టింది