శ్రీశైలం: రైతులు ఎవరూ పంటలు వేసుకోవద్దు,పంటలు సాగు చేస్తే నీటి కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు: MLA బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు మండలంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి రైతులతో కలిసి సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రగూడూరు కెనాల్ లాక్ఇన్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు సారె సమర్పించారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న సూపర్ ఎల్నినో పరిస్థితులను రైతులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావం జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని, అందువల్ల రైతులు ఎవరూ పంటలు వేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.