నగరి: నగరిలో 2 కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు
నగరి నియోజకవర్గంలోని అయినంబాకం, మహారాజపురం గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. సుమారు 7.78 కోట్ల రూపాయలతో ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.