కొడిమ్యాల: చెప్యాల లో సద్దుల బతుకమ్మ రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం వెంకటేశ్వర స్వామి నామాల దర్శనం
సద్దుల బతుకమ్మ వేడుకల్లో,సోమవారం రోజు రాత్రి 10 గంటలకు ఆకాశంలో వెంకటేశ్వర స్వామి నామాల వలె మేఘాలు మధ్యలో చందమామ కనిపించిన ఈ అద్భుత దృశ్యం,జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,చెప్యాల గ్రామంలో ఆవిష్కృతమైంది,మహిళలు బతుకమ్మ నిమజ్జనం చేస్తుండగా ఈ అద్భుత దృశ్యం కెమెరా కంటికి చిక్కింది,అయితే ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన మహిళలు సద్దుల బతుకమ్మ నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాల రూపంలో దర్శన భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు,అయితే ఈ అద్భుత దృశ్యం మల్యాల,గంగాధర,బోయినపల్లి మండలాల్లో దాదాపు 40 నిమిషాలకు పైగా కనువిందు చేసింది,