సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణంలో జరిగిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశం
దేశ వ్యాప్తంగా ప్రజలు కార్మిక వర్గం హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాలస్వామి అధ్యక్షతన జిల్లా కార్యాలయం కార్మిక కర్షక భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో 8 గంటల నుండి