శ్రీశైలం: రాబోయే సర్పంచ్ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించి కూటమి ప్రభుత్వం తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలి: మాజీ MLA శిల్పా చక్రపాణి
రాబోయే సర్పంచ్ ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించి కూటమి ప్రభుత్వం తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే బుడ్డా రౌడీలా బెదిరింపులకు దిగారని, పోలీసులు, అధికారుల సహకారంతో కౌంటింగ్లో అవకతవకలు చేసి టీడీపీ గెలిచినట్లు ప్రకటించుకున్నారని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పిటిసి స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ నైతికంగా గెలిచిందని శిల్పా పేర్కొన్నారు.