రాప్తాడు: తగరకుంట గ్రామంలో 85 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో బుధవారం ఒంటి గంట పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత 85 లక్షల రూపాయలతో పిటి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ తగరకుంట గ్రామంలో 65 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించి రెండు బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగిందని అదేవిధంగా 550 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో మహిళలు అధికారులు టిడిపి నేతలు పాల్గొన్నారు.