మార్కాపురం: చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తలంబ్రాలు కలుపుట కార్యక్రమం చేసినట్లు తెలిపిన అర్చకులు అప్పనాచార్యులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి నుండి ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణం కోసం వికాస తరంగిణి మహిళల చేత తలంబ్రాలు కలుపుట కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈఓ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. బుధవారం రాత్రి అంకురార్పణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.