కొణిజర్ల: ఖమ్మం జిల్లాలో 8 బాల్య వివాహాలను అడ్డుకున్న పోలీసులు: 12 కేసులు నమోదు
ఖమ్మం జిల్లాలో ఇటీవల జరుగుతున్న 8 బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. కూసుమంచి, తల్లాడ, వైరా, సత్తుపల్లి, కామేపల్లి, బోనకల్ మరియు ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో ఈ వివాహాలను ఆపి, మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.