సిరిసిల్ల: పెద్దూరులో ఘనంగా పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో విశ్వబ్రాహ్మణ కమిటీ ఆధ్వర్యంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.