ఒంగోలు అర్బన్: సింగరాయకొండ లోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక ఉత్తర్వులను జారీ చేశారు. ఏడు నెలల క్రితం పాఠశాలలో తౌషిక్ అనుమానస్పద మృతి చెందాడు. తమ కుమారుడి మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ మౌలాబి పాఠశాల కు అనుమతులు లేవని అధికారులకు ఫిర్యాదులు చేసింది. అధికారులు విచారణ చేపట్టి పాఠశాల గుర్తింపు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం విషద్రవం తాగిన మౌలాభి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.