నిజామాబాద్ నార్త్: పోలీస్ ప్రజావాణి: 36 ఫిర్యాదులు స్వీకరించిన కమిషనర్ పి.సాయి చైతన్య
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పి.సాయి చైతన్య 36 అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు పోలీసు సేవలను నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు.