డిచ్పల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించింది: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందని ఆయన విమర్శించారు. బీజేపీ కిసాన్ మోర్చా సైకిల్ యాత్రలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.