శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ స్వ
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదలను అనుసరించి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.అమ్మవారి వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదం చిత్రపటం అందజేశారు.