గిద్దలూరు: కంభం మండలం జంగంగుంట్ల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 15 గొర్రెలు మృతి, 15 గొర్రెలకు తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో దాదాపు రూ. 6 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని రైతు వాపోయాడు. ఆగ్రహం చెందిన గ్రామస్తులు అద్దాలను ధ్వంసం చేశారు. వర్షం పడుతున్న సమయంలో రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లుగా బస్సు డ్రైవర్ చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.