జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. భారీగా ట్రాఫిక్ జామ్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం మిషన్ భగీరథ పైప్ లైన్ పగలడంతో జాతీయ రహదారిపై నీరు, బురద చేరుకుంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడి, ట్రాఫిక్ స్తంభించింది. నీటితో పాటు మట్టి కంకర రోడ్డుపైకి రావడంతో వాహనదారులకు రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.