దర్శి: మండల పరిధిలోని ఆరు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్ట చర్యలు: ఏఎస్ఐ రాంబాబు
Darsi, Prakasam | Apr 17, 2025 దర్శి మండలంలోని చందలూరు, బసిరెడ్డిపల్లి సహా ఆరు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అన్యాయని దర్శి ఏఎస్ఐ రాంబాబు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు . ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారని, తనకు కేటాయించిన గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఉంచుతానని రాంబాబు తెలిపారు.