రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక అధికారి సమీక్ష
2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారి ఎస్. సురేష్ కుమార్ రాజమహేంద్రవరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పుష్కర ఘాట్లు, రవాణా, వసతి, భద్రత మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు.