దర్శి: తాళ్లూరు మండలం నాగం బొట్లపాలెంలో 2025 ఖరీఫ్ సాగు ప్రణాళికలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం
Darsi, Prakasam | May 13, 2025 తాళ్లూరు మండలం నాగం బొట్లపాలెంలో 2025 ఖరీఫ్ సాగు ప్రణాళికలో భాగంగా మంగళవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఏవో ప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి సాగు ఇన్ఛార్జ్ నరసింహులు మాట్లాడుతూ..ప్రతి రైతు కొంత భూమిని ప్రకృతి సాగుకు కేటాయించాలని సూచించారు. అనంతరం రైతులతో ప్రతిజ్ఞ చేయించి, ఆదర్శ రైతులకు సన్మానం చేశారు.