దర్శి: దర్శి పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహణ
Darsi, Prakasam | May 12, 2025 దర్శి పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా తిరుగుతున్న 27 ఆటోలకు సంబంధించి 25 వేల రూపాయల జరిమాణాలు విధించి పలు వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్క వాహనానికి సరైన దృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని లేనియెడల జరిమానాలు లేదా కేసులు వేయించడం జరుగుతుందని తెలిపారు.