కుప్పం: పట్టణంలో వాహనాలు నడుపుతుండగా మైనర్లను పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన అర్బన్ సీఐ శంకరయ్య
కుప్పం పురపాలక సంఘ పరిధిలో చిన్న పిల్లలకు అనగా మైనర్లు వాహనాలు నడుపుతుండగా వారిని పట్టుకుని వారి తల్లిదండ్రులను పిలిపించి అర్బన్ సీఐ శంకరయ్య ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కౌన్సిలింగ్ అందించారు. ఇక మీదట ఎవరైనా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.