కుప్పం: కొత్తపేటలో రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించిన ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం
కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని 13,14, 15 వార్డులకు సంబంధించి రేషన్ షాపులను రిబ్బన్ కట్ చేసి ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుదారులకు బియ్యం మరియు పప్పు, పంచదారను అందజేశారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఎండియూ వాహనాలు ఎప్పుడు వస్తుందో తెలియక, రేషన్ కార్డుదారులు ఇబ్బందులకు గురయ్యేవారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల అభిప్రాయాలను సేకరించి, నేటి నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారన్నారు. పండుగ వాతావరణంలో రేషన్ షాపులను ప్రారంభించడం జరిగిందన్నారు.